: 23న దానం నాగేందర్ టీఆర్ఎస్ లో ప్రవేశం?
గ్రేటర్ హైదరాబాదు కాంగ్రెస్ నేత దానం నాగేందర్ టీఆర్ఎస్ లో చేరనున్నారా? అంటే అవుననే అంటున్నారు ఆయన సన్నిహితులు. ఇందుకు ముహూర్తం కూడా సిద్ధమైందని పలువురు పేర్కొంటున్నారు. టీఆర్ఎస్ నేత, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మధ్యవర్తిత్వంతో వీరి మధ్య అవగాహన కుదిరిందని, త్వరలోనే ఆయన టీఆర్ఎస్ లో చేరనున్నారని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. దానం టీఆర్ఎస్ లో చేరేందుకు ముహూర్తం ఈ నెల 23న అని, సీఎం కేసీఆర్ సమక్షంలో దానం కారెక్కనున్నారనని సమాచారం. కాగా, దానం మాత్రం అవన్నీ పుకార్లని, తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు.