: మంత్రి నిమ్మకాయల రాజప్పను అడ్డుకున్న మహిళలు


ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్పను మహిళలు అడ్డుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంకు ఈరోజు ఆయన వెళ్లారు. తమ గ్రామంలో ఉన్న బ్రాందీ షాపును తొలగిస్తారా? లేదా? అంటూ మహిళలు ఆయన్ని అడ్డుకున్నారు. బ్రాందీ షాపును తక్షణం తొలగించాలంటూ డిమాండ్ చేశారు. ఈ విషయమై సంబంధిత అధికారులతో మాట్లాడతానని, పదే పది రోజుల్లో బ్రాందీ షాపును ఇక్కడి నుంచి తరలిస్తామని మంత్రి చినరాజప్ప హామీ ఇవ్వడంతో మహిళలు శాంతించారు.

  • Loading...

More Telugu News