: భారతీయ సినిమాల్లోనే పాటలుంటాయి: కమలహాసన్


సినిమాల్లో పాటల ప్రస్తావన తెస్తే దిగ్గజ నటుడు కమల్ హాసన్ నవ్వేశారు. భారతీయ సినిమాల్లోనే ప్రతి ఒక్కరూ పాటలు పాడుతారని ఆయన అన్నారు. గతంలో పని చేసుకునేటప్పుడు అలసట తెలియకుండా పాట పాడేవారని, అప్పటి భాష కూడా అలాగే ఉండేదని ఆయన అన్నారు. ఓ పని చేస్తూ నటుడు పాట పాడుతూ, చెట్లు పుట్టల వెనుక స్టెప్పులు వేస్తూ వెళ్లడం తనకు ఇప్పటికీ చిత్రంగా అనిపిస్తుందని అన్నారు. 'చీకటి రాజ్యం' సినిమా కేవలం రెండు గంటల సినిమా అని చెప్పారు. ఓకే ఒక్క పాట ఉందని, అది కూడా సన్నివేశాల బ్యాక్ డ్రాప్ లో వస్తుందని ఆయన పేర్కొన్నారు. భారతీయ సినిమా ప్రయాణం మారాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఇంటర్నెట్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచాన్ని ఇంట్లోకి తెచ్చిన ఇంటర్నెట్ వైవిధ్యానికి, నూతన ప్రయోగాలకు ధైర్యమిచ్చిందని ఆయన తెలిపారు. అయితే టెక్నికల్ విలువల పరంగా భారతీయ సినిమా ఎంతో మారాల్సి ఉందని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News