: భద్రాచలం వద్ద పెరిగిన గోదావరి ఉద్ధృతి
ఖమ్మం జిల్లాలోని భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 38 అడుగులకు చేరింది. నిన్న సాయంత్రం నుంచి చూస్తే 3 అడుగుల వరకు నీటిమట్టం పెరిగింది. సంబంధిత అధికారులు గోదావరి నీటిమట్టం వివరాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. కాగా, వాజేడు మండలంలోని చీకుపల్లి కాజ్ వే నీట మునిగింది. ఖమ్మం జిల్లాలో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో అక్కడున్న వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని గ్రామాలకు వెళ్లే రహదారులు నీటమునిగాయి. దీంతో గ్రామస్థులు ఎటూ కదలలేక నానా ఇబ్బంది పడుతున్నారు.