: పాక్ ఆరోపణలను ఖండించిన ఆఫ్ఘన్ అధ్యక్షుడు


పాకిస్థాన్ ఆరోపణలను ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ ఖండించారు. పెషావర్ ఎయిర్ బేస్ పై దాడికి తెగబడిన ఉగ్రవాదులు 17 మంది సామాన్య పౌరులు, సైనికాధికారులను బలిగొన్న సంగతి విదితమే. ఈ దాడిలో ఆఫ్ఘనిస్థాన్ హస్తముందని పాక్ ఆరోపించింది. దీనిపై ఆఫ్ఘన్ అధ్యక్షుడు మాట్లాడుతూ, అలాంటి వారికి తమ దేశం మద్దతివ్వదని స్పష్టం చేశారు. పరాయిదేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే చర్యలకు తాము పాల్పడమని తెలిపారు. పాక్ అసత్య ప్రచారం మానుకుంటే మంచిదని ఆయన హితవు పలికారు. ఉగ్రవాదుల కారణంగా తాము ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామని, వ్యక్తిగతంగా కూడా బాధ అనుభవిస్తున్నామని ఆయన చెప్పారు. పాక్ లో ఉగ్రదాడులకు బలైన వారి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢసానుభూతి తెలిపారు.

  • Loading...

More Telugu News