: చంద్రబాబు సింగపూర్ టూర్ రూటు మారింది...గన్నవరం నుంచి బయలుదేరిన ఏపీ సీఎం
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సింగపూర్ పర్యటనకు సంబంధించి రూటు మారింది. నేటి రాత్రి హైదరాబాదులోని శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి చంద్రబాబు సింగపూర్ బయలుదేరతారని తొలుత వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలకు భిన్నంగా చంద్రబాబు నేటి ఉదయమే తన ప్రతినిధి బృందంతో కలిసి సింగపూర్ బయలుదేరివెళ్లారు. అది కూడా విజయవాడ సమీపంలోని గన్నవరం నుంచి చంద్రబాబు సింగపూర్ బయలుదేరడం గమనార్హం. ఇక రేపు, ఎల్లుండి సింగపూర్ లో పర్యటించనున్న చంద్రబాబు 23న తిరిగి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.