: టీటీడీ పాలక మండలి సభ్యులను నెట్టేసిన భద్రతా సిబ్బంది... తిరుమల బ్రహ్మోత్సవాల్లో ఉద్రిక్తత
తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా కొద్దిసేపటి క్రితం ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేటి ఉదయం స్వామివారికి వాహన సేవ ప్రారంభమైంది. ఈ సేవలో పాలుపంచుకునేందుకు వచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి సభ్యులు రమణ, శేఖర్, కృష్ణమూర్తిలను భద్రతా సిబ్బంది పక్కకు నెట్టేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన టీటీడీ బోర్డు సభ్యులతో భద్రతా సిబ్బంది వాగ్వాదానికి దిగారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చిన నేపథ్యంలో అదుపు చేసే క్రమంలోనే తాము చర్యలు చేపట్టాల్సి వచ్చిందన్న భద్రతా సిబ్బంది వివరణపై టీటీడీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.