: భవిష్యత్తు క్రికెట్ టీ20ది కాదు... టీ10ది: సయ్యద్ కిర్మాణి


అభిమానులను అలరించే క్రమంలో క్రికెట్ ఎన్నో కొత్త రూపులు సంతరించుకుంది. టెస్టులు, 60 ఓవర్ల వన్డేలు, 50 ఓవర్ల వన్డేలు, కలర్ డ్రస్సులు, వైట్ బాల్స్, జిగేల్మనే స్టంప్స్, డే నైట్ మ్యాచ్ లు, టీ20 మ్యాచ్ లు... ఇలా ఎన్నో ప్రయోగాలు. ప్రస్తుతం టీ20 ఫార్మాట్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. టీ20ల దెబ్బకు వన్డేలు కనుమరుగు అవుతాయనే చర్చలు జరిగిన సంగతి కూడా విదితమే. అయితే, భవిష్యత్తు క్రికెట్ ఫార్మాట్ టీ20 కాదని టీమిండియా మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణీ తేల్చి చెప్పారు. త్వరలోనే టీ10 ఫార్మాట్ వస్తుందని... భవిష్యత్తులో ఆ ఫార్మాట్ హవానే కొనసాగుతుందని అన్నారు.

  • Loading...

More Telugu News