: ప్రాణహిత-చేవెళ్ల డిజైన్ మార్చడం వెనుక పెద్ద కుట్ర ఉంది: రేవంత్ రెడ్డి


శంకర్ పల్లి నుంచి చేవెళ్ల వరకు టీటీడీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ రోజు ఆ పార్టీ పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్చరాదని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పాదయాత్ర చేవెళ్ల చేరుకున్న తర్వాత అక్కడ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రాణహిత-చేవెళ్ల డిజైన్ మార్చడం వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు. ప్రతి ఒక్కరినీ మెప్పించి, ఒప్పించి రంగారెడ్డి జిల్లాకు నీటిని అందించాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News