: తిరుపతిలో హెలికాప్టర్ జాయ్ రైడ్స్ వాయిదా


తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన హెలికాప్టర్ జాయ్ రైడ్స్ వాయిదా పడింది. వాతావరణం అనుకూలించకపోవడంతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. భక్తులకు హెలికాప్టర్ ఎక్కిన అనుభూతిని కలిగించేందుకు ఏపీ పర్యాటక శాఖ, పవన్ హాన్స్ సంస్థలు ఈ కార్యక్రమాన్ని సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. వాతావరణం అనుకూలిస్తే రేపు సాయంత్రం జాయ్ రైడ్స్ ను ప్రారంభిస్తామని నిర్వాహకులు తెలిపారు.

  • Loading...

More Telugu News