: 4.78 లక్షల ఓట్లను మాత్రమే తొలగించాం: సోమేష్ కుమార్


గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీఆర్ఎస్ ప్రభుత్వం భారీ ఎత్తున ఓట్లను తొలగిస్తోందని విపక్షాలు మండిపడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ ఓ స్పష్టత ఇచ్చారు. గ్రేటర్ పరిధిలో కేవలం 4,77,972 ఓట్లను మాత్రమే తొలగించామని చెప్పారు. రెండు చోట్ల ఓటు ఉన్నవారు, చనిపోయిన వారు, డోర్ లాక్ ఉన్న వారి ఓట్లను మాత్రమే తొలగించామని తెలిపారు. దీంతోపాటు, గణేష్ నిమజ్జనానికి పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. హైదరాబాదులో గతుకులమయమైన రోడ్లను మూడు రోజుల్లోగా బాగుచేస్తామని తెలిపారు. దసరా కానుకగా ఐడీహెచ్ కాలనీలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News