: దుబాయి రాజు పెద్దకొడుకు గుండెపోటుతో మృతి


దుబాయి రాజు పెద్ద కుమారుడు షేక్ రషీద్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ (33) గుండెపోటుతో ఈరోజు మృతి చెందాడు. దుబాయ్ కు రాజే కాకుండా... ఉపాధ్యక్షుడు, ప్రధాన మంత్రి కూడా అయిన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ పెద్దకుమారుడే షేక్ రషీద్ అల్ మక్తౌమ్. రాజుకు, అతని పెద్ద భార్యకు కలిగిన సంతానమే రషీద్ అల్ మక్తౌమ్. మక్తౌమ్ అంతిమయాత్ర ఈ రోజే జరగనుంది. బిన్ రషీద్ అల్ మక్తౌమ్ మృతి నేపథ్యంలో, దుబాయ్ లో మూడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. కాగా, మక్తౌమ్ కు ఆటల పట్ల చాలా ఆసక్తి ఉంది. హార్స్ రైడింగ్ అంటే అతనికి చాలా ఇష్టం.

  • Loading...

More Telugu News