: టి.టీడీపీ అధ్యక్ష పదవి రేసులో నేను లేను: ఎర్రబెల్లి
తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి రేసులో తాను లేనని ఆ పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. ఇప్పటికే తాను శాసనసభాపక్షనేతగా ఉన్నానని, అధ్యక్ష పదవికి సీఎం చంద్రబాబు ఎవరిని ఎంపిక చేసినా తన సహకారం ఉంటుందని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎర్రబెల్లి తెలిపారు. ఇటీవల పార్టీ అధినేత చంద్రబాబును తెలంగాణ టీడీపీ నేతలు కలిశారు. ఆ సమయంలో తెలంగాణ పార్టీ అధినేతను ఎవరిని నియమించాలన్న అంశంపై ప్రధానంగా చర్చించారు. ఈసారి ఐవీఆర్ఎస్ పద్ధతి ద్వారా తెలంగాణ పార్టీ అధినేతను ఎంచుకోవాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఇందుకు నేతలంతా సరేనని చెప్పారు. ఈ క్రమంలో త్వరలో తెలంగాణ టీడీపీకి కొత్త నేత నియామకం కానున్నారు.