: ప్రధాని మోదీపై విరుచుకుపడ్డ రాహుల్


సాదాసీదా మోదీకి నేడు రూ.15 లక్షల సూటు ఎక్కడి నుంచి వచ్చిందని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశ్నించారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన చంపారన్ జిల్లాలో ఈ రోజు మధ్యాహ్నం పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ లపై నిప్పులు చెరిగారు. ఒకప్పుడు చాయ్ వాలా అయిన నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక ఆయన ధరించే దుస్తులు మారిపోయాయి. ప్రధాని కాగానే రూ. 15 లక్షల విలువ చేసే సూట్ ధరించారు. ఇంతమార్పు ఎలా సాధ్యమంటూ ఆయన ప్రశ్నించారు. పేదలను కలవని మోదీ కేవలం సూట్ బూట్ వేసుకున్న వాళ్లనే కలుసుకుంటున్నారని రాహుల్ ఎద్దేవా చేశారు. ప్రతి భారతీయుడి అకౌంటులో రూ. 15 లక్షలు, రైతులకు 50 శాతం అధిక మద్దతు ధర, 2 కోట్ల మందికి ఉద్యోగావకాశాలు... వంటి మోదీ హామీలపై రాహుల్ విమర్శలు గుప్పించారు.

  • Loading...

More Telugu News