: మిత్రపక్షాలు మొహం చాటేసిన వేళ... బీహార్ లో రాహుల్ ఒంటరి!


బీహార్ ఎన్నికల సంగ్రామంలో ఆరంభంలోనే కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలిందా? ప్రస్తుత పరిస్థితి చూస్తే అవుననే అనిపిస్తోంది. బీహార్ ఎన్నికల్లో జేడీయూ, ఆర్జేడీ, పార్టీలతో జతకట్టిన ఆ పార్టీ తరపున ప్రచారం చేసేందుకు రాహుల్ గాంధీ ఈ ఉదయం బీహార్ చేరుకున్నారు. అయితే, మిత్రపక్షాలు దూరం కావడం వల్ల పొత్తు కొనసాగుతుందా? లేదా? అన్న విషయమై కొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి. పశ్చిమ చంపారన్ జిల్లాలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించనుండగా, మొదట ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆపై జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ సభకు రాలేమని చెప్పారు. ముందుగా షెడ్యూల్ వేసుకున్న ప్రకారం ప్రచారాన్ని కొనసాగించేందుకే నిర్ణయించుకున్న రాహుల్ ఒంటరిగానే సభలకు హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మిత్రుల గైర్హాజరులో సాగే ఈ సభకు కాంగ్రెస్ పార్టీ స్థానిక నేతలు అన్ని ఏర్పాట్లూ చేశారు. ఆర్జేడీ, జేడీయూ కూటమితో కలిసి బీహార్ లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ మొత్తం 40 చోట్ల తన అభ్యర్థులను బరిలోకి దించనున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News