: తన శాఖపై విమర్శలు చేసిన సీఎంకు కేఈ కృష్ణమూర్తి ఇచ్చిన సమాధానం ఇదే!


రెవెన్యూ శాఖలో రెండంకెల అవినీతి వేళ్లూనుకుందని చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కలెక్టర్ల కాన్ఫరెన్సులో ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తి సమాధానం ఇచ్చారు. చంద్రబాబును ప్రశంసిస్తూనే, తన శాఖ గురించి గొప్పగా చెప్పుకున్నారు. ప్రజలకు మేలు కలిగించేలా పలు సంస్కరణలను తమ శాఖ తీసుకువచ్చిందని తెలిపారు. కేవలం రెండు వారాల్లో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఇవ్వడానికి ఆదేశాలు జారీ చేశామని, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేందుకు గడువును నిర్ణయించామని తెలిపారు. వెబ్ సైట్ మాధ్యమంగా భూముల వివరాలు పొందుపరుస్తున్నామని, వాటిల్లోని తప్పులను సరిదిద్దడానికి సైతం కృషి చేస్తున్నామని అన్నారు. రెవెన్యూ శాఖలో ప్రచారంలో వున్నట్టుగా అవినీతి లేదని ఆయన అన్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News