: సిటీ, సివిక్, జాజ్, సీఆర్-వీ... అన్నింట్లోనూ లోపాలే, ఇండియాలో అతిపెద్ద 'రీకాల్' చేసిన హోండా


జపాన్ కేంద్రంగా పనిచేస్తూ, ఇండియాలో టాప్-5 కార్ల మార్కెటింగ్ సంస్థల్లో ఒకటిగా ఉన్న హోండా దేశవ్యాప్తంగా 2003 నుంచి 2011 వరకూ విక్రయించిన 2,23,578 కార్లను రీకాల్ చేసింది. ఈ కార్లలో అమర్చిన ఎయిర్ బ్యాగ్ లలో సమస్యలు ఉన్నాయని, ప్రమాదాల సమయంలో అవి తెరచుకోవడం లేదని ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. హోండా నుంచి మార్కెటింగ్ అవుతూ ప్రముఖ మోడల్స్ గా గుర్తింపు పొందిన సిటీ, సివిక్, జాజ్, సీఆర్-వీలను రీకాల్ చేస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. అక్టోబర్ 12 నుంచి సంస్థ డీలర్ షిప్ కేంద్రాల్లో ఎయిర్ బ్యాగుల మార్పు దశలవారీగా జరుగుతుందని, ఎప్పుడు రావాలన్న విషయాన్ని కస్టమర్లకు స్వయంగా తెలియజేస్తున్నామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రధానంగా డ్రైవర్ వైపునున్న ఎయిర్ బ్యాగ్ అమరికలో లోపాలున్నట్టు కనుగొన్నామని సంస్థ తెలిపింది.

  • Loading...

More Telugu News