: ఒబామా సంచలన నిర్ణయం... స్వలింగ సంపర్కుడి చేతికి అమెరికా సైన్యం పగ్గాలు!


అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకు తాను స్వలింగ సంపర్కుడిగా (గే) ప్రకటించుకున్న ఎరిక్ ఫాన్నింగ్ ను తదుపరి ఆర్మీ కార్యదర్శిగా నామినేట్ చేశారు. ప్రస్తుతం ఎరిక్ యూఎస్ అండర్ సెక్రటరీ ఆఫ్ ఆర్మీగా విధులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఒబామా తీసుకున్న నిర్ణయానికి సెనెట్ ఆమోదం పలికితే, యూఎస్ చరిత్రలో ఆర్మీ పగ్గాలు చేపట్టే తొలి 'గే'గా ఎరిక్ నిలుస్తాడు. ఆయన వ్యక్తిగత జీవితంతో తనకు పనిలేదని, ఆర్మీలో ఆయనకున్న అపార అనుభవం, నాయకత్వ లక్షణాలను గమనించే కొత్త బాధ్యతలు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నామని ఒబామా వ్యాఖ్యానించారు. భువిపై అమెరికా సైన్యాన్ని అత్యున్నత స్థానంలో నిలిపేందుకు ఎరిక్ తో కలసి పనిచేయనున్నట్టు ప్రకటించారు.

  • Loading...

More Telugu News