: మా అమ్మ పడ్డ కష్టాన్ని 40 కోట్ల మందికి దూరం చేస్తా: కేంద్రమంత్రి దత్తాత్రేయ


తన తల్లి ఎన్నో కష్టాలు పడిందని, ఆ కష్టాలను 40 కోట్ల మంది భారతీయ మహిళలు పడకుండా చూస్తానని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. న్యూఢిల్లీలో జరిగిన ఓ సదస్సులో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ, "నా చిన్నతనంలో మా అమ్మ నేలమీద ఉల్లిపాయలు గుట్టగా పోసి అమ్మకాలు సాగించేది. నేను కూడా ఆమెకు సహకరిస్తూ ఉండేవాడిని. మా అమ్మలాంటి అసంఘటిత కార్మికులు, చిరు వ్యాపారులు దేశంలో 40 కోట్ల మంది వరకూ ఉన్నారు. అప్పుడు మా అమ్మ పడ్డ కష్టం, ఇప్పుడు ఎవరికీ లేకుండా చేస్తాను" అని అన్నారు. అనార్గనైజ్డ్ సెక్టారులోని వ్యాపారులకు గుర్తింపునిస్తామని, వారికి చట్టబద్ధమైన మద్దతు, సామాజిక భద్రతలను కల్పించేందుకు తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని దత్తాత్రేయ హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News