: ఓర్వలేకే జగన్ రైతులను రెచ్చగొడుతున్నారు: ముద్దుకృష్ణమ
ఏపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూడలేక వైఎస్సార్సీపీ అధినేత జగన్ రైతులను రెచ్చగొడుతున్నారని టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆరోపించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, వైఎస్ హయాంలోనే మచిలీపట్నం పోర్టుకు భూములు సేకరించే ప్రయత్నం చేశారని, ఇప్పుడు జగన్ పోర్టుకు వ్యతిరేకంగా పోరాడడం విచిత్రంగా ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే జగన్ రైతులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. జగన్ కు అంతర్జాతీయ స్థాయి రాజధాని అవసరం లేదని, రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో సోనియాతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్న జగన్, ఇప్పుడు కూడా అదే రీతిలో వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.