: ఐఎస్ చెరలో ఏడాదిగా ఉన్న భారతీయులు క్షేమం: సుష్మాస్వరాజ్
ఏడాది కాలంగా ఐఎస్ఐఎస్ చెరలో ఉన్న భారతీయులు క్షేమంగా ఉన్నారని కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు. ఢిల్లీలో బందీల కుటుంబ సభ్యులు ఆమెను కలిసిన సందర్భంగా సుష్మా మాట్లాడుతూ, తమకున్న సమాచారం ప్రకారం వారంతా క్షేమంగా ఉన్నట్టు తెలుస్తోందని అన్నారు. బందీలను విడిపించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని ఆమె వారికి వివరించారు. కాగా, గత ఏడాది జూన్ లో ఉగ్రవాదులు 39 మంది భారతీయులను బందీలుగా పట్టుకున్నారు. అప్పటి నుంచి వారికోసం కుటుంబ సభ్యులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అప్పటి నుంచి సుష్మాస్వరాజ్ వారి కుటుంబ సభ్యులను ఎనిమిది సార్లు కలిశారు.