: సెల్ ఫోన్ మాట్లాడుతూనే వంట... దుస్తులు అంటుకున్న విషయాన్ని కూడా గుర్తించలేదు!


సెల్ ఫోన్లు మానవ జీవితాన్ని ఎంతగా నాశనం చేస్తున్నాయో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్-12లో నివసించే కతీజా బేగం (17) అనే యువతి ఈ ఉదయం ఇంట్లో వంట చేస్తోంది. ఇంతలో ఫోన్ రావడంతో... సెల్ ఫోన్లో మాట్లాడుతూనే వంట చేయడం కొనసాగించింది. ఈ క్రమంలో, ఆమె దుస్తులకు మంటలు అంటుకున్నాయి. మాటల్లో పడిన ఆమె తన దుస్తులకు మంటలు అంటుకున్న విషయాన్ని గుర్తించలేకపోయింది. దీంతో, ఆమె ఒళ్లంతా మంటలు వ్యాపించాయి. దీన్ని గమనించిన కుటుంబ సభ్యలు వెంటనే మంటలను ఆర్పి, ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News