: టీమిండియా వెంట పడటం అనవసరం: అఫ్రిదీ
రానున్న డిసెంబర్ లో యూఏఈలో భారత్-పాక్ జట్ల మధ్య జరగాల్సిన సిరీస్ పై ఇంకా సందిగ్ధత తొలగలేదు. ఈ సిరీస్ ను ఎలాగైనా నిర్వహించేలా చేయాలని పాక్ క్రికెట్ బోర్డు ప్రయత్నిస్తుంటే... బీసీసీఐ నుంచి మాత్రం ఎలాంటి సంకేతాలు రావడం లేదు. ఈ క్రమంలో, పాక్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ స్పందించాడు. ఈ సిరీస్ పై ఇంతవరకు బీసీసీఐ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదని... వెలువడుతుందన్న ఆశ కూడా లేదని అన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా వెంటపడటం మానేయడమే బెస్ట్ అని చెప్పాడు. బీసీసీఐతో చర్చలు మానేసి... ఇతర జట్లను స్వదేశానికి రప్పించే ప్రయత్నం చేస్తు బాగుంటుందని సూచించాడు.