: నేను చేస్తున్న పూజల వల్లే హూదూద్ తుపానులో ప్రాణ నష్టం తప్పింది: టి.సుబ్బరామిరెడ్డి
ఏదైనా చెప్పాలంటే కాంగ్రెస్ ఎంపీ, పారిశ్రామికవేత్త టి.సుబ్బరామిరెడ్డి తర్వాతనే ఎవరైనా. హుదూద్ తుపానుతో విశాఖపట్నం అతలాకుతలమైందని... కానీ, తాను చేసిన ఈశ్వర పూజలే ప్రాణ నష్టం జరగకుండా కాపాడాయని ఆయన చెప్పారు. సుబ్బరామిరెడ్డి గొప్ప శివభక్తుడు అన్న సంగతి తెలిసిందే. శివుడికి ప్రత్యేక యాగాలు, హోమాలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి. ఈ రోజు విశాఖపట్నంలోని ఆనందపురంలో ఎంపీ నిధులతో నిర్మించిన కమ్యూనిటీ భవన్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.