: పైసా చేతిలో లేకుండా కోట్లకు అధిపతులయ్యారు!


చిల్లిగవ్వ చేతిలో లేకుండా ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని, తమ జీవితాలను విజయపథంలో నడిపించుకున్న వ్యాపారవేత్తలు చాలామందే ఉంటారు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే, 14 మంది ప్రముఖ సంస్థల యజమానుల గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే. ఆ పద్నాలుగు మంది విజయ శిఖరాగ్రాన నిలిచారు. తమ సంస్థలో పని చేసే ఉద్యోగులకే కాదు, ప్రపంచానికే ఆదర్శవంతంగా నిలిచారు. వారి వివరాలు... 1. జాన్ కౌమ్, వాట్సప్ సీఈఓ, కో-ఫౌండర్ ఒకప్పుడు ఫుడ్ స్టాంప్స్ పై ఆధారపడి జీవించిన జాన్ కౌమ్ ది ఉక్రెయిన్. పదహారు సంవత్సరాల వయస్సులో అక్కడి నుంచి అమెరికాకు వెళ్లిపోయింది ఆయన కుటుంబం. అనంతరం అనేక సంఘటనలు, పరిణామాలు ఆయన జీవితంలో చోటుచేసుకున్నాయి. 2009లో కౌమ్, బ్రియాన్ ఆక్టన్ లిద్దరూ కలిసి రియల్ టైమ్ మెస్సేజింగ్ సిస్టమ్ వాట్సప్ ను ప్రారంభించారు. కాలిఫోర్నియాలోని మౌంటెన్ వ్యూ లో దీని ప్రధాన కార్యాలయం ఉంది. నికర ఆస్తుల విలువ 7.7 బిలియన్ డాలర్లు (ఫోర్బ్స్ ఆధారంగా). కౌమ్ వయస్సు 35 సంవత్సరాలు. 2. జాక్ మా, అలీబాబా ఆన్ లైన్ రిటైల్ సంస్థ చైనాలోని హాంగ్ జూలో జన్మించిన జాక్ మా కటిక పేదరికం అనుభవించాడు. స్థానిక కేఎఫ్ సీలో ఆయనకు ఉద్యోగం లభించలేదు. రెండుసార్లు నేషనల్ ఫైనల్ కాలేజ్ ఎంట్రన్స్ లో ఫెయిలయ్యాడు. ఎట్టకేలకు గ్రాడ్యుయేట్ అయ్యాడు. ఇంగ్లీషు టీచర్ గా ఆయన కెరీర్ ప్రారంభించాడు. 1995లో మొట్టమొదటిసారిగా అమెరికాకు వెళ్లాడు. ఇంటర్నెట్ ని ఫస్టుసారి అక్కడే చూశాడు. దాని గురించి బాగా తెలుసుకున్నాడు. 1999లో అలీబాబా ఆన్ లైన్ రిటైల్ సంస్థను ప్రారంభించాడు. సెప్టెంబర్ ఐపీఓతో చైనాలో అత్యంత ధనికుడయ్యాడు. నికర ఆస్తుల విలువ 20.2 బిలియన్ డాలర్లు. 3. ఎలిజబెత్ హోమ్స్, బ్లడ్ డయాగ్నస్టిక్స్ సంస్థ పందొమ్మిది సంవత్సరాల వయస్సులో బ్లడ్ డయాగ్నస్టిక్స్ కంపెనీని ప్రారంభించింది. దీని ద్వారా రక్తపరీక్షలను చాలా తక్కువ ధరలకే చేసేవారు. స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీ నుంచి ఆమె 2003లో బయటకు వచ్చిన అనంతరం ఈ సంస్థను ప్రారంభించడం గమనార్హం. ఆమె సంస్థలో మొత్తం 500 మంది ఉద్యోగులు ఉన్నారు. ఆమె సంస్థ నికర ఆస్తుల విలువ 4.5 బిలియన్ డాలర్లు. ప్రస్తుతం ఆమె వయస్సు 30 సంవత్సరాలు. 4. ఇంగ్వర్ కామ్ప్రాద్, ఐకేఈఏ సామ్రాజ్యాధిపతి స్వీడన్ కు చెందిన ఇంగ్వర్ తన ఏడేళ్ల వయస్సులోనే మ్యాచ్ బాక్స్ లను తన పొరుగువారికి అమ్ముతుండేవాడు. ఆ తర్వాత పెన్సిళ్లు, గ్రీటింగ్ కార్డ్స్, క్రిస్టమస్ ఆభరణాలను విక్రయించేవాడు. 17 సంవత్సరాల వయస్సులో ఐకేఈఏ అనే ఒక కంపెనీని ఇంగ్వర్ స్థాపించాడు. 21 సంవత్సరాల వయస్సులో ఫర్నీచర్ అమ్మకాలు మొదలుపెట్టాడు. దీంతో ఐకేఈఏ వ్యాపార సామ్రాజ్య విస్తరణ మొదలైంది. ప్రస్తుతం ఆయన సంస్థలు 42 దేశాలలో 340 స్టోర్లు కలిగి ఉన్నాయి. కోట్లకు పడగలెత్తిన 88 సంవత్సరాల ఇంగ్వర్ విమానంలో కేవలం ఎకనామి క్లాసులో ప్రయాణిస్తాడట. ఐకేఈఏ నికర ఆస్తుల విలువ 3.9 బిలియన్ డాలర్లు. 5. హోవర్డ్ స్కుల్జ్, స్టార్ బక్స్ సీఈఓ యూనివర్శిటీ ఆఫ్ నార్నర్న్ మిచిగాన్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తయిన అనంతరం హోవర్డ్ స్కుల్జ్ జిరాక్స్ సెంటర్ లో పనిచేశాడు. ఆ తర్వాత ఒక కాఫీ షాపు, స్టార్ బక్స్ ను నడిపేందుకు తీసుకున్నాడు. అప్పుడు స్టార్ బక్స్ కాఫీ షాపులు కేవలం 60 మాత్రమే ఉండేవి. 1987లో ఆయన స్టార్ బక్స్ సీఈఓ స్థానంలో నిలబడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే 16,000 స్టార్ బక్స్ అవుట్ లెట్స్ ఉన్నాయి. తాను ఈరోజున సూటు బూటు వేసుకున్నప్పటికీ తానేంటో తనకు తెలుసని అంటున్న హోవర్డ్ స్కుల్జ్ సంస్థ నికర ఆస్తుల విలువ 2.1 బిలియన్ డాలర్లు. వీరితో పాటు ఆఫ్రికన్ అమెరికన్ టీవీ మొట్టమొదటి కరస్పాండెంట్ ఓప్రా విన్ ఫ్రే, అమెరికాకు చెందిన ఫ్లెక్స్-ఎన్-గేట్ వ్యవస్థాపకుడు షాహిద్ ఖాన్, అమెరికా మొదటి జనరేషన్ కు చెందిన, పాట్రన్ టెక్విలా అధినేత జాన్ పాల్ డిజోరియా, ఫరెవర్ 21 కోఫౌండర్ డూ వన్ చాంగ్, లుక్సోటికా వ్యవస్థాపకుడు లియోనార్డ్ వెచియో, పోలో బోర్డు సభ్యుడు రాల్ఫ్ లారెన్, లెజెండరీ ట్రేడర్ జార్జ్ సొరోస్, ప్రతిష్టాత్మక ఒరాకిల్ సంస్థ వ్యవస్థాపకుడు లారీ ఎలీసన్, రష్యన్ టైకూన్ రోమన్ అబ్ర మోవిచ్ లు పేదరికం నుంచి ఎదిగి వారి సంస్థల ఆస్తులను బిలియన్ డాలర్ల స్థాయికి చేర్చినవారే.

  • Loading...

More Telugu News