: ఢిల్లీ మెట్రో రైల్లో దారుణం... 16 ఏళ్ల బాలుడు హత్య
దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ఘటన చోటు చేసుకుంది. సీటు కోసం జరిగిన చిన్నపాటి గొడవలో ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. మెట్రో రైల్లో సీటు కోసం గవర్నమెంట్ పాఠశాల విద్యార్థులు కొందరి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఇషు అనే 16 సంవత్సరాల బాలుడిని మిగతా విద్యార్థులు కత్తితో పొడిచి చంపినట్టు తెలిసింది. కింగ్స్ వే క్యాంప్ సమీపంలో జరిగిన ఈ ఘటన మెట్రో రైలు ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గరిచేసింది. పోలీసులు ప్రస్తుతం ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.