: ఉస్మానియా ఇంత దయనీయమా?: గీతారెడ్డి విస్మయం


ఉస్మానియా యూనివర్శిటీలో పరిస్థితులు ఇంత దుర్భరంగా మారతాయని తాను అనుకోలేదని, విద్యార్థులు ఇంత అపరిశుభ్ర వాతావరణంలో ఇబ్బందులు పడతున్నారని కేసీఆర్ సర్కారు తెలుసుకోలేకపోవడం సిగ్గు చేటని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత గీతారెడ్డి నిప్పులు చెరిగారు. ఇంత దయనీయంగా ఉస్మానియాను ఎన్నడూ చూడలేదని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చిన్నారెడ్డి, పద్మావతి తదితరులతో కలసి ఆమె వర్శిటీ హాస్టళ్లను ఈ మధ్యాహ్నం సందర్శించారు. బంగారు తెలంగాణ అంటే, విద్యార్థుల మెస్ లను తెరవకుండా చేసి, వాళ్లను ఆకలితో పడుకోబెట్టడమేనా? అని ఆమె ప్రశ్నించారు. విద్యార్థుల అండతో గద్దెనెక్కిన కేసీఆర్, ఆపై వారిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఓయూ పరిస్థితిపై కేసీఆర్ సర్కారును అసెంబ్లీలో నిలదీస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News