: ఈసారి ఓ మహిళ, ఓ పురుషుడు ఇద్దరూ కలసి సూది గుచ్చేశారు


తూర్పుగోదావరి జిల్లాలో సైకో సూదిగాళ్లు మళ్లీ ఇంజెక్షన్ వేశారు. జిల్లాలోని సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో ఈ ఘటన జరిగింది. వేట్లపాలెంకు చెందిన శ్రీనివాస్ తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. ఈ మధ్యాహ్నం పని ముగించుకుని బైక్ పై వెళుతుండగా... వెనక నుంచి బైక్ పై వచ్చిన ఓ పురుషుడు, ఓ మహిళ శ్రీనివాస్ వీపుపై సూది గుచ్చి వెళ్లిపోయారు. ఊహించని ఘటనతో షాక్ కు గురైన శ్రీనివాస్ వెంటనే ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News