: ఏపీకి రెండో స్థానం అందుకే!: సీపీఎం కార్యదర్శి మధు సెటైర్
ప్రపంచ బ్యాంక్ పెట్టుబడి అనుకూల రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కు రెండో స్థానం లభించడంపై సీపీఎం ఏపీ కార్యదర్శి మధు సెటైర్ వేశారు. కార్మిక సంక్షేమాన్ని పక్కన పెట్టడం వల్లనే రాష్ట్రానికి రెండో స్థానం లభించిందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మళ్లీ ప్రపంచబ్యాంకు పాలన మొదలైందని విలేకరులతో మాట్లాడుతూ ఆరోపించారు. గతంలో ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ గా పేరు తెచ్చుకున్న సీఎం చంద్రబాబు మరోసారి ఆ బ్యాంకు విధానాలను అమలుపరుస్తున్నారని దుయ్యబట్టారు. 76,426 ఎకరాలను కార్పొరేటు కంపెనీలకు కట్టబెట్టడానికి ప్రభుత్వం సిద్ధమైందన్నారు. సర్కారు బలవంతపు భూసేకరణపై త్వరలో భారీ ఉద్యమం చేపట్టి రాష్ట్ర బంద్ కు, అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తామని మధు హెచ్చరించారు.