: కేటీఆర్ ను ఆకర్షించిన అధునాతన గాడ్జెట్స్ షో
అంతర్జాతీయంగా భారతదేశ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, భవిష్యత్ లో ఇంటర్నేషనల్ గాడ్జెట్ ఎక్స్ పోను హైదరాబాద్ లో నిర్వహిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో ఇండియన్ నేషనల్ గాడ్జెట్ ఎక్స్ పోను కేటీఆర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ అత్యాధునిక పరిజ్ఞానంతో గాడ్జెట్స్ ను ఈ షోలో ప్రదర్శిస్తున్నారని, షో చాలా ఆకర్షణీయంగా ఉందని అన్నారు. ఈ నెల 18 నుంచి 21వ తేదీ వరకు ఈ ఎక్స్ పో జరుగుతుంది. శుక్ర, శనివారాలలో సూపర్ సెమినార్ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.