: పాక్ కూ తప్పని ‘ఉగ్ర’ ముప్పు.. పెషావర్ ఎయిర్ బేస్ పై విరుచుకుపడ్డ ఉగ్రవాదులు
ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ కూ ‘ఉగ్ర’ ముప్పు తప్పలేదు. నేటి ఉదయం పాకిస్థాన్ లో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. పాక్ నగరం పెషావర్ లోని బాదాబర్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదులు ముప్పేట దాడికి యత్నించారు. అయితే అప్రమత్తంగా ఉన్న పాకిస్థానీ సైన్యం ఉగ్రవాదుల దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఎయిర్ బేస్ పై మొత్తం పది మంది ఉగ్రవాదులు దాడికి దిగగా, పాక్ సైన్యం ఆరుగురు తీవ్రవాదులను కాల్చివేసింది. మరో నలుగురు ఉగ్రవాదులు అక్కడి నుంచి పరారయ్యారు. ప్రస్తుతం పాక్ బలగాలు పరారైన ఉగ్రవాదుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి.