: ఐఫోన్ కావాలా?...అయితే, ఆ 'దానం' చేస్తే చాలట!


స్మార్ట్ ఫోన్ ప్రియులకు ‘యాపిల్’ విడుదల చేసిన ఐఫోన్ అంటే విపరీతమైన క్రేజ్. అందుకే, ఇప్పటిదాకా విడుదలైన అన్ని ఐఫోన్ లకూ భారీ డిమాండ్ వుంది. మార్కెట్ లోకి రావడమే ఆలస్యం, ఐఫోన్లు ఖాళీ అయిపోతున్నాయి. ఇక ఆన్ లైన్ మార్కెట్ లో క్షణాల్లో లక్షలాది ఫోన్లు విక్రయమైపోతున్నాయి. ఐఫోన్ చేజిక్కించుకోవడమంటే, వ్యాలెట్ నిండా నోట్లతో పాటు అదృష్టం కూడా ఉండాలి. ఎందుకంటే, మనం బుక్ చేసినప్పుడు మనలాంటి వారు లక్షల మంది ఐఫోన్ కోసం క్యూ కట్టడం తెలిసిందే కదా. ఇక తాజాగా ఐఫోన్ తాజా వెర్షన్ ఐఫోన్ 6ఎస్ ను యాపిల్ సంస్థ మార్కెట్లోకి చేసింది. దీనిని చేజిక్కించుకునేందుకు చైనీయులు నానా తంటాలు పడుతున్నారు. ఇద్దరు వ్యక్తులు ఐఫోన్ ను దక్కించుకునేందుకు ఏకంగా తమ కిడ్నీలనే ఆన్ లైన్ లో విక్రయానికి పెట్టారు. అయితే వారి యత్నం బెడిసికొట్టిందనుకోండి. ఇక ఆ దేశానికి చెందిన స్మెర్మ్ బ్యాంకులు (వీర్యం సేకరణ, నిల్వ కేంద్రాలు) ఓ సరికొత్త ప్రకటనను జారీ చేశాయి. ‘‘వీర్యం దానం చేయండి. ఐఫోన్ 6ఎస్ పట్టుకుపోండి’’ అంటూ అక్కడి స్పెర్మ్ బ్యాంకులు ఇచ్చిన యాడ్ లకు భారీ స్పందనే లభిస్తున్నట్లు సమాచారం. ప్రకటన చూసి పరిగెడితే కుదరదట. వీర్యం ఇచ్చేందుకు కూడా ఆ యాడ్ కొన్ని అర్హతలను పేర్కొంది. కనీస ఎత్తు 165 సెంటీ మీటర్లు ఉండటమే కాక, ఎలాంటి జన్యుపరమైన వ్యాధులు కూడా ఉండరాదట. 17 మిల్లీ లీటర్ల వీర్యం దానమిస్తే ఐఫోన్ కు సరిపడా రూ.60 వేలు ఇస్తారట. ఒకే వ్యక్తి ఎన్నిసార్లైనా వీర్యం దానం చేయవచ్చట. అయితే ఒకసారి ఇచ్చిన వ్యక్తి నుంచి మళ్లీ 48 రోజుల తర్వాతే తీసుకుంటారట.

  • Loading...

More Telugu News