: పిడిగుద్దులు, ముష్టిఘాతాలు... మల్లయుద్ధాన్ని తలపించిన జపాన్ పార్లమెంట్


సాక్షాత్తు ప్రధాని సమక్షంలోనే పార్లమెంటు సభ్యులు పట్టు తప్పారు. ఒకరిపై మరొకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు... కలబడ్డారు... కూర్చునే కుర్చీలపైకి ఎక్కారు. ముష్టిఘాతాలు విసురుకున్నారు. సాంతం మల్లయుద్ధంగా తలపించిన ఈ ఘటన జపాన్ పార్లమెంటులో చోటుచేసుకుంది. గతంలో ఆ దేశ పార్లమెంటులో ఎన్నడూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోలేదు. ఉక్రెయిన్, కొరియా, సిరియా తదితర దేశాల మాదిరి పార్లమెంటులను తలపించే మల్లయుద్ధం లాంటి ఫైట్ సీన్ నిన్న జపాన్ పార్లమెంటులో కనిపించింది. ప్రధాని షింజో అబే వారిస్తున్నా, ఆయన మాట విన్న సభ్యుడు ఒక్కరు కూడా లేరట. దీంతో అబే కోపంగా సభ నుంచి దాదాపు వాకౌట్ చేసినంత పనిచేశారు. తమ దేశ ఆర్మీ బయటి దేశాలకు కూడా వెళ్లి పోరాడాలని ఇటీవల రూపొందిన బిల్లుకు ఆ దేశ దిగువ సభ ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఇక ఈ బిల్లుకు తుది ఆమోదం కోసం ఎగువ సభలో ప్రవేశపెట్టిన సందర్భంగా ఈ గలాటా చోటుచేసుకుంది. బిల్లును రూపొందించిన కమిటీ చైర్మన్ పై బిల్లును వ్యతిరేకిస్తున్న సభ్యులు విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగానే మల్లయుద్ధం చోటుచేసుకుంది. ఆ తర్వాత రంగప్రవేశం చేసిన మార్షల్స్ అతి కష్టం మీద చైర్మన్ ను బయటకు తీసుకెళ్లారు.

  • Loading...

More Telugu News