: 70 ప్రేమ లేఖలు రాశాను: క్రిష్
కాలేజీ రోజుల్లో సుమారు 70 ప్రేమ లేఖలు రాసి ఉంటానని ప్రముఖ దర్శకుడు క్రిష్ తెలిపాడు. హైదరాబాదులో జరుగుతున్న 'కంచె' ఆడియో వేడుకలో క్రిష్ మాట్లాడుతూ, తొలిసారి పదవ తరగతిలో ఉండగా ఓ స్నేహితుడి కోరికపై ప్రేమ లేఖ రాసానని అన్నాడు. ఇక అప్పట్నుంచి అది తన వృత్తి అయిపోయిందని, ఫ్రెండ్స్ లో ఎవరికి ప్రేమ లేఖ అవసరం పడినా క్రిష్ గుర్తుకు వచ్చేవాడని, చాలా మంది ఫ్రెండ్స్ తనతో ప్రేమ లేఖలు రాయించారని, అలా 70 ప్రేమ లేఖలు రాసి ఉంటానని చెప్పాడు. మరి పర్సనల్ లేఖల గురించి అడిగితే ఇక్కడే తన తండ్రి ఉన్నారని, ఆ 70లోనే తనవి కూడా కలిపేసుకోవాలని క్రిష్ తెలిపాడు.