: రకుల్ కి నేనంటే ఇష్టం...నాకు రకుల్ అంటే ఇష్టం: రెజీనా
'రకుల్ ప్రీత్ సింగ్ కి నేనంటే ఇష్టం, నాకు రకుల్ ప్రీత్ అంటే ఇష్టం' అంటోంది కథానాయిక రెజీనా. 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' సినిమా ప్రమోషన్ లో భాగంగా మాట్లాడుతూ, హీరో సందీప్ ద్వారా తామిద్దరం కలిశామని చెప్పింది. ఒకే హోటల్ లో ఉండడం వల్ల ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని రెజీనా వెల్లడించింది. రకుల్ కు సినిమాలంటే చాలా ఇష్టమని, రాత్రి పది గంటలైనా సినిమా చూద్దామని అంటుందని, నిద్ర ముంచుకొచ్చినా ఆమె కోసం సినిమా చూస్తానని చెప్పింది. రకుల్ లో ప్రత్యేకత ఏంటంటే...జస్ట్ మూడు గంటల పాటు నిద్రపోయినప్పటికీ భలే తాజాగా కనిపిస్తుందని, ఎంత లేటుగా పడుకున్నా ఉదయం 5 గంటలకే లేచి జిమ్ కి వెళ్లడం రకుల్ కి అలవాటని రెజీనా కొనియాడింది. తామిద్దరం పర్శనల్ విషయాలన్నీ షేర్ చేసుకుంటామని రెజీనా వెల్లడించింది.