: ఇది తారక్ మోస్ట్ స్టైలిష్ లుక్ అంటున్న టాలీవుడ్ భామ


వినాయక చవితిని పురస్కరించుకుని జూనియర్ ఎన్టీఆర్ తాజా సినిమా 'నాన్నకు ప్రేమతో...' ఫస్ట్ లుక్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫస్ట్ లుక్ కు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఫిదా అయిపోతున్నారు. వారి జాబితాలో టాలీవుడ్ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ కూడా చేరింది. 'తారక్ మోస్ట్ స్టైలిష్ లుక్ ఇదే కదా?' అంటూ ట్వీట్ చేసింది. లండన్ షెడ్యూల్ ముగించుకుని ఇప్పుడే హైదరాబాదు చేరుకున్నానని, చాలా ఆనందంగా ఉందని రకుల్ పేర్కొంది. వినాయక చవితిని ఎకో ఫ్రెండ్లీగా జరుపుకుంటే వినాయకుడు చాలా సంతోషిస్తాడని రకుల్ ట్విట్టర్ ద్వారా అభిమానులకు సూచించింది.

  • Loading...

More Telugu News