: హైదరాబాదులోనే ఉన్నారు కదా...మిమ్మల్ని కలవాలనుంది: షారూఖ్ కు సైనా రిక్వెస్ట్


బ్యాడ్మింటన్ లో ఉన్నత శిఖరాలు అధిరోహించిన సైనా టీవీ సీరియల్ లో నటించి అభిమానులను మెప్పించాలని భావిస్తోంది. దీంతో సీనియర్ల సలహాలు తీసుకోవడం ఉత్తమం అని భావించి, ఒక్కొక్కరిని కలుస్తోంది. ఈ మధ్యే అభిమాన నటి కాజోల్ ను కలిసిన సైనా, షారూఖ్ ఖాన్ ను ఎన్నాళ్టినుంచో కలవాలని భావిస్తోంది. హైదరాబాదులోని రామోజీ ఫిలింసిటీలో 'దిల్ వాలే' సినిమా షూటింగ్ కోసం షారూఖ్ ప్రస్తుతం హైదరాబాదులో ఉన్నాడు. 'దీంతో మిమ్మల్ని కలవాలని ఉంది...హైదరాబాదులోనే ఉన్నారు కదా?' అంటూ షారుక్ కి ట్విట్టర్లో రిక్వెస్ట్ పెట్టింది. దీనికి షారుఖ్ సమాధానమిస్తూ 'నిన్నెప్పుడు కలవాలో చెప్పు' అంటూ అడిగాడు. 'శుక్రవారం వచ్చి కలుస్తా' అని సైనా సమాధానమిచ్చింది. దీనికి షారూఖ్ ఓకే చెప్పాడు.

  • Loading...

More Telugu News