: మూడేళ్ల తరువాత తెలంగాణలో విద్యుత్ కోతలు ఉండవు: ఈటల
మూడేళ్ల తరువాత తెలంగాణలో విద్యుత్ కోత అనేది ఉండదని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. మెదక్ జిల్లాలోని కల్హేర్ లో దీపం కనెక్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వచ్చే ఏడాది పగటి పూట వ్యవసాయానికి కరెంటు ఇస్తామని అన్నారు. మరో మూడేళ్లలో విద్యుత్ కోతలు లేని తెలంగాణను చూసేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇప్పటికే తెలంగాణలోని పలు ప్రాంతాలకు పూర్తి స్థాయి విద్యుత్ సరఫరా చేస్తున్నామని ఆయన చెప్పారు.