: మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన ప్రముఖులు!
ప్రధాని నరేంద్ర మోదీ 66వ పడిలోకి అడుగుపెట్టారు. ప్రపంచ దేశాల్లోని ప్రముఖుల పుట్టిన రోజులు తెలుసుకుని మరీ శుభాకాంక్షలు చెప్పే ప్రధానిని ఎవరెవరు విష్ చేశారో తెలుసుకోవాలనే కుతూహలం అందర్లోనూ ఉంటుంది. ఆడంబరాలకు దూరంగా జరుపుకుంటున్న ఈ పుట్టిన రోజుకి ట్విట్టర్ మాధ్యమంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, జర్మనీ ఛాన్స్ లర్ ఏంజెలా మోర్కెల్, రష్యా ప్రధాని మెద్వదేవ్, చైనా ప్రధాని జీ జిన్ పింగ్ తదితరులు ప్రధానికి పుట్టిన రోజు శభాకాంక్షలు చెప్పారు. కాగా, వీరందరికీ పేరుపేరునా ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. కాగా ప్రధాని 1965 ఇండోపాక్ యుద్ధానికి సంబంధించిన స్మారక మ్యూజియం శౌర్యాంజలిని సందర్శించి, నాటి అమర జవాన్లను శ్రద్ధాంజలి ఘటించారు.