: హైదరాబాదు చేరుకున్న చంద్రబాబు...ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీ టీడీపీ నేతలతో భేటీ


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నేడు హైదరాబాదుకు వచ్చారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ పాలన కోసం విజయవాడలో క్యాంపు కార్యాలయంతో పాటు తాత్కాలిక నివాసాన్ని ఏర్పాటు చేసుకున్న చంద్రబాబు వారంలో ఐదు నుంచి ఆరు రోజుల పాటు అక్కడే ఉంటున్నారు. నిన్న పట్టిసీమలో కొత్తగా ఏర్పాటు చేసిన పంపులను ప్రారంభించిన ఆయన అటు నుంచి అటే తిరుమల వెళ్లి శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని వెంకన్నకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం నేటి ఉదయం ఆయన తిరుపతి నుంచి హైదరాబాదు చేరుకున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహానికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత టీ టీడీపీ నేతలతో చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశానికి టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణతో పాటు టీ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు, ఉపనేత రేవంత్ రెడ్డి, పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు తదితరులు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News