: సింగపూర్ తరహాలో ఏపీలో సింగిల్ పార్టీనే...వైసీపీ, కాంగ్రెస్ లు గల్లంతేనన్న రావెల


ఏపీలో భవిష్యత్తు రాజకీయ స్థితిగతులపై టీడీపీ సీనియర్ నేత, ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్ బాబు కొద్దిసేపటి క్రితం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన సరికొత్త కోణాన్ని ఆవిష్కరించారు. సమీప భవిష్యత్తులో రాష్ట్రంలో సింగిల్ పార్టీనే ఉండనుందని కూడా ఆయన జోస్యం చెప్పారు. సింగపూర్ లో ప్రస్తుతం ఒకే పార్టీ విజయం సాధిస్తూ వస్తోంది. సింగపూర్ తరహాలోనే రాష్ట్రంలోనూ ఇక సింగిల్ పార్టీ ప్రభుత్వానిదే అధికారమని ఆయన తేల్చిచెప్పారు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న వైసీపీతో పాటు మొన్నటి ఎన్నికల్లో సింగిల్ సీటు కూడా దక్కించుకోలేని కాంగ్రెస్ పార్టీలు వచ్చే ఎన్నికల నాటికి పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని ఆయన ప్రకటించారు.

  • Loading...

More Telugu News