: విఘ్నాలు తొలగి ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నా: గవర్నర్ నరసింహన్
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కొద్దిసేపటి క్రితం ఖైరతాబాదు గణనాథుడికి ప్రత్యేక పూజలు చేసి చవితి ఉత్సవాలను ప్రారంభించారు. సతీసమేతంగా వచ్చిన ఆయన ఖైరతాబాదు గణనాథుడికి తొలి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖైరతాబాదు వినాయకుడికి దేశ్యాప్తంగా గుర్తింపు ఉందని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరికీ విఘ్నాలు తొలగి సంతోషంగా జీవించేలా చూడాలని తాను విఘ్నేశ్వరుడిని వేడుకున్నానని తెలిపారు. గణేశ్ ఉత్సవాలను ప్రారంభించేందుకు వచ్చిన నరసింహన్ దంపతులను ఖైరతాబాదు గణేశ్ ఉత్సవ కమిటీ ఘనంగా సత్కరించింది.