: ఖైరతాబాదు వినాయుడి ప్రతిష్ఠాపనకు రంగం సిద్ధం... ఉత్సవాలను ప్రారంభించనున్న గరవ్నర్


తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదు మరికాసేట్లో గణేశ్ నామస్మరణతో మారు మోగనుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగానూ భారీ గణనాథుడిగా ప్రసిద్ధిగాంచిన ఖైరతాబాదు వినాయకుడి విగ్రహ ప్రతిష్ఠాపన మరికాసేపట్లో జరగనుంది. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మరికాసేపట్లో సతీసమేతంగా ఖైరతాబాదు గణనాథుడి విగ్రహాన్ని సందర్శించుకుని వినాయక చవితి ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఖైరతాబాదు గణేశ్ ఉత్సవ సమితి భారీ ఏర్పాట్లు చేసింది.

  • Loading...

More Telugu News