: నేటి నుంచి కాణిపాకం వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలు... 21 రోజుల పాటు ఉత్సవాలు


వరసిద్ధి వినాయకుడిగా పూజలు అందుకుంటున్న కాణిపాకం గణనాధుడి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. దాదాపు 21 రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాలకు కాణిపాకం ఆలయ కమిటీ భారీ ఏర్పాట్లు చేసింది. వినాయక చవితిని పురస్కరించుకుని నేటి నుంచి మొదలు కానున్న వినాయకుడి బ్రహ్మోత్సవాలకు ఈ ఏడాది పెద్ద సంఖ్యలో భక్తులు రానున్నట్లు అంచనా. వీటిలో భాగంగా నేడు వినాయక చవితి, గ్రామోత్సవం కార్యక్రమాలు జరగనున్నాయి. వినాయకుడి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నేటి తెల్లవారుజాము నుంచే గణనాధుడిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.

  • Loading...

More Telugu News