: బదిలీల జీవో ఇచ్చి, వెంటనే ఉపసంహరించుకున్న ఏపీ ప్రభుత్వం


రెవెన్యూశాఖలో 23 మంది ఆర్డీవో, డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ జీవో జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే దానిని ఉపసంహరించుకుంది. కొంత మందికి పదోన్నతులు, మరి కొంత మందికి బదిలీలు కల్పిస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్ 872, 873, 874, 875 మంగళవారం జారీ చేసింది. అయితే ఈ బదిలీలు, పదోన్నతుల్లో స్పష్టత లేదని అభిప్రాయపడుతూ వాటిని నిలిపేసినట్టు ప్రకటించింది. దీనిపై జీవో నెంబర్ 882 జారీ చేసింది. దీంతో రెవెన్యూ శాఖలో బదిలీలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.

  • Loading...

More Telugu News