: బ్రహ్మోత్సవం వేళ ఈ మహత్కార్యానికి శ్రీకారం చుట్టడం సంతోషదాయకం: చంద్రబాబు
తిరుపతి బ్రహ్మోత్సవం వేళ పట్టిసీమ ప్రాజెక్టు మొదటి పంపుహౌస్ నుంచి నీటిని విడుదల చేయడంపై సీఎం చంద్రబాబు ఆనందం వ్యక్తం చశారు. నేడు ఈ మహత్కార్యానికి శ్రీకారం చుట్టడం సంతోషదాయకమన్నారు. పట్టిసీమ వద్ద మొదటి పంపునకు పూజలు నిర్వహించిన అనంతరం చంద్రబాబు మాట్లాడారు. వీలైనంత సాగునీరు అందించడమే లక్ష్యమని చెప్పారు. పట్టిసీమపై చాలా శ్రద్ధపెట్టామని, పోలవరంపై మరింత శ్రద్ధ పెడతామని తెలిపారు. పట్టిసీమకు ఎంత ప్రాధాన్యమిస్తున్నామో పోలవరానికి అంతే ప్రాధాన్యత ఇస్తామన్నారు. రోజూ 5 నిమిషాలు పోలవరంపైనే ఆలోచిస్తున్నామని చెప్పారు. బ్రహ్మోత్సవాలకు వెళ్లాల్సి ఉన్నా పట్టిసీమ పనుల కోసం వచ్చానన్న సీఎం, ఇంత శరవేగంగా పనులు చేపట్టిన అధికారులకు అభినందనలు తెలిపారు.