: నిమజ్జనం రోజు తెగ డ్యాన్స్ చేసేవాడినంటున్న బాలీవుడ్ నటుడు


వినాయకచవితి నిమజ్జనం సందర్భంగా ఆ ఊపును నియంత్రించుకోలేక తెగ డ్యాన్స్ చేసేవాడినని బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్ తెలిపాడు. 'బాజీరావ్ మస్తానీ' సినిమాలో నటిస్తున్న రణ్ వీర్ సింగ్ పూణేలో ఓ గణేష్ మంటపం దగ్గరకెళ్లి అభిమానులను పలకరించాడు. ఈ సందర్భంగా డోలు వాయించి అభిమానులను అలరించాడు. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవాల్లో తన వ్యవహార శైలి గురించి చెప్పుకొచ్చాడు. మరాఠా రాజు 'బాజీరావ్' మహావీరుడు మాత్రమే కాదు, మహా మనిషని రణ్ వీర్ పేర్కొన్నాడు. దశాబ్ద కాలంలో ఇలాంటి అవకాశం ఒకేసారి వస్తుందని, అందుకే ఈ పాత్ర గురించి చెప్పగానే ఓకే అనేశానని తెలిపాడు. ఈ సినిమా కోసం మరికొన్ని సినిమా అవకాశాలను వదులుకున్నానని రణ్ వీర్ చెప్పాడు. ఈ సినిమాలో 'మస్తానీ'గా దీపికా పదుకునే నటిస్తోంది. ఈ సినిమాను ఇదే జంటతో గతంలో 'రామ్ లీలా' తీసిన సంజయ్ లీలా బన్సాలీ రూపొందిస్తున్నాడు.

  • Loading...

More Telugu News