: ప్రత్యేక వ్యక్తుల జాబితా నుంచి వాద్రా పేరు అధికారికంగా తొలగింపు
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఎయిర్ పోర్టుల్లో తనిఖీ అవసరంలేని ప్రత్యేక వ్యక్తుల జాబితా నుంచి వాద్రా పేరును తొలగిస్తున్నట్టు పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ నేడు ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై దేశంలోని అన్ని ఎయిర్ పోర్టుల్లో వాద్రాను తనిఖీ చేసిన తరువాత ప్రయాణానికి అనుమతిస్తారు. దానిపై స్పందించిన వాద్రా, "ఫెంటాస్టిక్.. వాళ్లు చేసిన పనికి చాలా ఆనందిస్తున్నా" అంటూ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. కాగా 'ప్రత్యేక వ్యక్తుల జాబితా నుంచి నా పేరు తొలగించకపోతే నేనే అన్ని ఎయిర్ పోర్టులకు వెళ్లినప్పుడు నా పేరు మీద స్టిక్కర్ అంటిస్తా'నని ఇటీవల వాద్రా ఫేస్ బుక్ లో పేర్కొన్నారు.