: ములాయంపై కేసు నమోదు చేయాలని లక్నో కోర్టు ఆదేశం
సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ పై కేసు నమోదు చేయాలంటూ లక్నోలోని సిజెఎం కోర్టు ఆదేశించింది. ఉత్తరప్రదేశ్ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ ను బెదిరించిన కేసులో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. అమితాబ్ భార్య నిర్వహిస్తున్న ఎన్జీఓ ద్వారా ప్రభుత్వానికి ఇబ్బందులు తెస్తున్నారంటూ ములాయం బెదిరించారు. అంతేగాక ఐపీఎస్ పై రేప్ కేసు పెట్టించి, సస్పెండ్ కూడా చేయించారు. ఈ క్రమంలో అమితాబ్ న్యాయస్థానానికి వెళ్లడంతో కేసు నమోదు చేయాలని ఆదేశాలు వచ్చాయి.