: ఇకపై మాకు ఏ ఎన్నికలతోనూ సంబంధం లేదు: కోదండరాం
వరంగల్ ఉపఎన్నికకు జేఏసీ దూరంగా ఉంటుందని తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ప్రకటించారు. ఇక నుంచి తమకు ఏ ఎన్నికలతోనూ సంబంధం ఉండదని స్పష్టం చేశారు. ఖమ్మంలో మీడియాతో మాట్లాడిన ఆయన, జేఏసీ ఆధ్వర్యంలో రేపు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించనున్నట్టు వెల్లడించారు. దేశంలో విదర్భ తరువాత తెలంగాణలోనే అత్యధికంగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల రుణాలు పూర్తిగా మాఫీ చేయాలని కోదండరాం డిమాండ్ చేశారు. ఎన్ కౌంటర్లు హింసను ప్రేరేపిస్తాయంటూ వరంగల్ ఎన్ కౌంటర్ పై స్పందించారు.